బారిస్టెర్ పార్వతీశం

కాస్తో కూస్తో తెలుగు రచయితల గురించి  తెలిసి ఉన్న వాళ్ళందరికీ ఈ పుస్తకం తెలిసే ఉంటుంది. నేను నవలలు కాని పెద్ద రచయితల పుస్తకాలు కాని ఎప్పుడూ చదవలేదు. కనుక ఈ నవల గురించి తెలియక పొవడం కాస్త చింతించాల్సిన విషయమే అయినా, ఆశ్చర్యపొనక్కరలెదు . అయితే ఆ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇంటిలొ ఈ నవల కంటపడింది. మా అత్తగారు ఇది చాలా మంచి నవల అని చెప్తే సరే చదువుదాము అని మొదలు పెట్టాను.

మొదటి నుంచి చివరి దాకా కథ అంతా పార్వతీశం అనే పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఎప్పుడు తన ఊరు దాటి వెళ్లని మనిషి ఒక్క సారిగా ఇంగ్లండ్ వెళ్లడం మొదలుకుని , అక్కడ అతని వేష భాషలు మార్చుకుని బారిస్టెర్ చదవడం, తిరిగి ఇండియా వచ్చి లాయర్ గా కొంత కాలం పని చెసి తరువాత అతని గ్రమం లొ స్థిరపడటం తొ ముగుస్తుంది.

ఇకపొతె నవల రాసిన రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు చాలా సునితమైన హస్యం తో కథని చెప్పారు. హస్యాభరితంగా చెప్పడం అతని ఉద్దేశ్యం కాకపోయినా చదివే ప్రతి వాళ్లని అది కడుపుబ్బా నవ్విస్తుంది. మొదటి భాగం నవ్వించినంతగా రెండు, ముడు భాగాలు నవ్వు రావు. శాస్త్రి గారు చెప్పినట్టు మనిషి ఎదుగుతున్న కొద్ది విజాఇ+నము  పెరుగుతుంది. అందుచేత అతనిలో హస్యం తగ్గటం సబబు అనిపించింది.

ఇక నవల చదివిన నా అనుభవం అంటారా,ఈ నవల చదివే కొద్ది పార్వతీశం గారి మీద అభిమానం ఎక్కువ అయింది. లండను వెళ్ళేటప్పుడు అతనిలో సహజమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి  కనిపిస్తయి .తిరిగి ఇండియాకి వచ్చి పెళ్ళి చెసుకుని లాయర్ వృత్తి లొ చేరినప్పుడు ఆడవాళ్ళ పట్ల గౌరవం,వృత్తి లొ ధైర్యం కనిపిస్తుంది. చివరిగ తన మనసు పట్ల నిజాయితి గా ఉండి చేస్తున్న వృత్తి ని విరమించుకుని వ్యవసాయం చేసుకుని స్థిరపడటం లో అతని నిజాయితి కనిపిస్తుంది. మొత్తం మీద నాకు ఈ నవల చాలా సంతోషాన్ని మిగిల్చింది.ఎదో హడవిడిగా చదివేసి పుస్తకాన్ని చదవటం పుర్తి చేసాము అనుకోవడం నాకు ఇష్టం లెదు అందుకే పార్వతీశం అనుభవాల్లని ఆనందిస్తూ, అప్పట్టి స్వతంత్ర రొజులని ఉహించుకుంటూ నిన్న చివరిగా పార్వతీశం కి సెలవు ఇచ్చాను.

2 Responses to “బారిస్టెర్ పార్వతీశం”


  1. 1 Maddy February 2, 2011 at 3:01 am

    I am also so fond of this book.
    I read it twice.
    I have a blog in which I am collecting all the parts of it.

    http://barristerpaarvateesam.blogspot.com

  2. 2 OneManArmy February 2, 2011 at 4:01 am

    Naaku chaala instamandi ee navala ante. Ippatiki 10 sarlu piga chadivanandi. Rendava part lo anukontanandi, paarvateesam oka english ammayiki veedkolu cheppe sannivesam chaala baguntundi. Naakayite kallo neelu thirigayi!


Leave a comment